బీజేపీ ఏపీ అధ్యక్షుడిగా సోమువీర్రాజు తొలగింపు

బీజేపీ ఏపీ అధ్యక్షుడిగా సోమువీర్రాజు తొలగింపు

బీజేపీ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు సోము వీర్రాజును తప్పిస్తూ పార్టీ హైకమాండ్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని సోము వీర్రాజును జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా సమాచారం పంపారు. దీంతో జులై 4వ తేదీ మధ్యాహ్నం తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు సోము వీర్రాజు.

'మీ టర్మ్‌ అయిపోయింది.. మిమ్మల్ని తప్పిస్తున్నాం.. రాజీనామా చేయాలి' అని పార్టీ జాతీయ అధ్యక్షులు నడ్డా.. స్వయంగా ఫోన్ చేసి చెప్పినట్లు వీర్రాజు వెల్లడించారు. కొత్త బాధ్యతల్ని అప్పగిస్తామని తనకు హామీ కూడా ఇచ్చినట్లు ఆయనే తెలిపారు. 2020, జులై 27వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు సోము వీర్రాజు.

సోము వీర్రాజు పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత.. ఏపీ బీజేపీలో ఒంటరి పోరాటంపై కార్యకర్తలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. బీజేపీ పార్టీ బలం పెరిగిందని.. స్వతంత్రంగా ఎదిగే ఆలోచన అనేది.. సోము వీర్రాజు వచ్చిన తర్వాతే జరిగిందని చాలా సందర్భాల్లో కార్యకర్తలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్ పార్టీ జనసేనతో కలిసి సీఎం జగన్ పాలనపై వ్యతిరేకతను జనంలోకి తీసుకెళ్లటంలో తన వంతు సాత్రను సమర్థవంతంగా నిర్వహించారు సోము వీర్రాజు.