తండ్రి కారు కొనివ్వలేదని కొడుకు మృతి

తండ్రి కారు కొనివ్వలేదని కొడుకు మృతి

చేర్యాల, వెలుగు: తండ్రి కారు కొనివ్వలేదని కొడుకు సూసైడ్ ​చేసుకున్నాడు.  సోమవారం. ఎస్సై దామోదర్​కథనం ప్రకారం.. సిద్దిపేట జిల్లా చేర్యాల మండల కేంద్రానికి చెందిన బుట్టి నవీన్​కుమార్​(26)  డ్రైవింగ్​ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కొన్ని రోజుల నుంచి తండ్రి నర్సింహులును సొంత కారు కొనివ్వాలని అడుగుతున్నాడు. టెంపరరీగా డ్రైవింగ్​చేసి డబ్బులు పొదుపుచేయాలని, వాటితో ఫైనాన్స్​లో కారు కొనిస్తానని తండ్రి సూచించాడు.

కానీ, అతను కారు కొనివ్వాల్సిందేనని పట్టుబడ్డి పనికి వెళ్లకుండా ఇంటి వద్దే ఉంటున్నాడు. సోమవారం ఎన్నిరోజులు ఇంటి వద్ద ఉంటావని తండ్రి మందలించడంతో మనస్తాపానికి గురైన నవీన్​కుమార్​పొలంలో వేపచెట్టుకు ఉరేసుకొని చనిపోయాడు. గతంలో కూడా కత్తితో ఎడమ చేయి కట్​చేసుకొని సూసైడ్​కు యత్నించాడు. తండ్రి నర్సింహులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.