సంక్రాంతి పండగ పూట విషాదం..బైక్ పై మామ, అల్లుడు వెళ్తుండగా... బ్రిడ్జిని ఢీకొట్టి..

సంక్రాంతి పండగ పూట విషాదం..బైక్ పై మామ, అల్లుడు వెళ్తుండగా... బ్రిడ్జిని ఢీకొట్టి..

కొమురం భీం జిల్లాలో సంక్రాంతి పండగ పూట విషాదం చోటు చేసుకుంది. బెజ్జూర్ మండలంలోని కుంటాలమానే పల్లి గ్రామం సమీపంలో మామ, అల్లుడు బైక్ పై వెళ్తుండగా జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. బుధవారం ( జనవరి 14 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. 

కౌటాల మండలం ముత్యంపేటకు చెందిన వ్యక్తి తన మామతో కలిసి బైక్ పై వెళ్తుండగా.. కుంటాలమానేపల్లి దగ్గర బైక్ అదుపుతప్పి బ్రిడ్జిని ఢీకొట్టింది.ఈ క్రమంలో బ్రిడ్జిపై నుంచి కిందపడి అల్లుడు అక్కడికక్కడే మృతి చెందగా.. మామకు తీవ్ర గాయాలయ్యాయి. 

చికిత్స కోసం మామను ఆసుపత్రికి తరలించగా.. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పండగ పూట ప్రమాదంలో అల్లుడు మరణించడంతో ఇరు కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి.