స్టుడెంట్ కిడ్నాప్: నిందితుడు అరెస్ట్

స్టుడెంట్ కిడ్నాప్: నిందితుడు అరెస్ట్

బి ఫార్మసీ విద్యార్థిని సోని కిడ్నాప్ కేసులో దర్యాప్తు వేగవంతం చేశారు పోలీసులు. నిందితుడు రవిశంకర్ కొడుకు, అల్లుడ్ని విజయవాడలో అదుపులోకి తీసుకున్నారు. యువతిని కిడ్నాప్ చేసిన రోజు రాత్రి 8 గంటల 15 నిమిషాలకు, రవిశంకర్ కారు బొంగులూరు ఔటర్ రింగ్ రోడ్ ఎక్కినట్టు పోలీసులు గుర్తించారు. 8 గంటల 30 నిమిషాలకు శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్ దగ్గర కారు దిగినట్టు సీసీ కెమెరాల ఆధారంగా గుర్తించారు పోలీసులు.  అ రోజు రాత్రి కర్నూల్ కు వెళ్ళారని చెబుతున్నారు. అక్కడి నుంచి నెల్లూరుకు వెళ్లినట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.