ఢిల్లీలో ఓటేసిన సోనియా,రాహుల్, ప్రియాంక

ఢిల్లీలో  ఓటేసిన సోనియా,రాహుల్, ప్రియాంక

 లోక్ సభ ఆరో విడత పోలింగ్ కొనసాగుతోంది.  6 రాష్ట్రాలు, 2 యూటీల్లో 58 స్థానాలకు  ఉదయం 7 గంటలకు పోలింగ్ జరుగుతుంది. మొత్తం 889 మంది అభ్యర్థులు ఈ ఎన్నికల బరిలో ఉన్నారు. ఢిల్లీలో 7 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఉదయం నుంచి పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.

ఉదయం కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.   న్యూ ఢిల్లీలో  సోనియాగాంధీ, రాహుల్ గాంధీ  కలిసి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు వేసిన తర్వాత పోలింగ్ కేంద్రం నుంచి బయటకు వెళ్తుండగా అమ్మతో సెల్ఫీ దిగారు రాహుల్.  కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంకగాంధీ వాద్రా తన భర్త రాబర్ట్ వాద్రా,  పిల్లలతో కలిసి క్యూ లైన్లో నిలబడి ఓటు వేశారు. ప్రియాంక ఓటు వేసి వచ్చే వరకు పోలింగ్ బూత్ బయట నిలుచున్నారు రాహుల్ గాంధీ.