
హైదరాబాద్/పంజాగుట్ట, వెలుగు: కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ బర్త్‌డేను సోమవారం బడంగ్పేటలోని గ్రీన్ రిచ్ కాలనీలో ఘనంగా నిర్వహించారు. పీసీసీ ప్రధాన కార్యదర్శి, మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి, కార్పొరేటర్లు, కాంగ్రెస్ నాయకులతో కలిసి కేక్‌కట్‌చేశారు.
వెంగళరావునగర్ లోని దుర్గాబాయి దేశ్ ముఖ్ ప్రభుత్వ మహిళ సాంకేతిక శిక్షణ సంస్థలోని స్టూడెంట్లతో కలిసి మంత్రి సీతక్క సోనియా గాంధీ బర్త్ డే నిర్వహించారు. వెంగళరావునగర్‌లో కాంగ్రెస్ నేత కన్స్యూమర్రైట్స్ప్రొటెక్షన్ ఫోరం జాతీయ కార్యదర్శి డాక్టర్ పీవీ రవిశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో కేక్‌కట్‌చేశారు.