సీడబ్ల్యూసీ సమావేశాలకు పోచంపల్లి ఇక్కత్ ​చీరలో సోనియాగాంధీ

 సీడబ్ల్యూసీ సమావేశాలకు పోచంపల్లి ఇక్కత్ ​చీరలో సోనియాగాంధీ

హైదరాబాద్, వెలుగు :  కాంగ్రెస్​ వర్కింగ్​ కమిటీ సమావేశాల కోసం హైదరాబాద్ వచ్చిన కాంగ్రెస్​అగ్రనేత  సోనియా గాంధీ పోచంపల్లి ఇక్కత్​చీరలో కనిపించారు. ఎరుపు రంగు చీరపై తెలుపు రంగు చారలతో కూడిన బార్డర్, తెలంగాణ చేనేత కళానైపుణ్యం ఉట్టి పడే డిజైన్లతో ఈ చీరను రూపొందించారు. 

తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్​పోచంపల్లి నేతన్నలు నేసే చీరలు, శాలువాలు, ఇతర వస్త్రాలకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. సాధారణంగా సోనియాగాంధీ కాటన్​ చీరలే ధరిస్తారు. 

Also Raed:  తెలంగాణలో మహిళల కోసం మహాలక్ష్మి స్కీమ్​! ప్రతి నెలా రూ.3 వేలు

అయితే హైదరాబాద్ సీడబ్ల్యూసీ సమావేశాలకు ఆమె ఇక్కత్​చీరలో హాజరవడం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్​గా నిలిచింది. ప్రియాంక గాంధీ బ్లాక్ చుడీదార్​లో, రాహుల్​ గాంధీ లైట్​బ్రౌన్​ కలర్​ ప్యాంట్, వైట్​టీ షర్ట్​లో సీడబ్ల్యూసీ సమావేశాల్లో పాల్గొన్నారు.