ఆస్పత్రిలో చేరిన సోనియా గాంధీ... రెగ్యులర్ చెక్ అప్ అన్న డాక్టర్లు

ఆస్పత్రిలో చేరిన  సోనియా గాంధీ... రెగ్యులర్ చెక్ అప్ అన్న డాక్టర్లు

న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ సోమవారం ఢిల్లీలోని సర్ గంగా రామ్ ఆస్పత్రిలో చేరారు. ఆమె కొంతకాలంగా దగ్గు సమస్యతో బాధపడుతున్నారని డాక్టర్లు తెలిపారు. ఇందులో భాగంగా రెగ్యులర్ చెక్ అప్ కోసం ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారని చెప్పారు. 

ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని..చెస్ట్ ఫిజీషియన్ పర్యవేక్షణలో ఉన్నారని పేర్కొన్నారు. సోనియాకు దీర్ఘకాలికంగా దగ్గు సమస్య ఉందని.. తరచూ చెక్ అప్ కోసం వస్తూ ఉంటారని వెల్లడించారు. ఢిల్లీలో కాలుష్యం కారణంగా సోమవారం సాయంత్రం ఆమె హాస్పిటల్ లో అడ్మిట్అయినట్టు వివరించారు.