అయోధ్య ప్రారంభోత్సవానికి సోనియా, ఖర్గే దూరం

అయోధ్య ప్రారంభోత్సవానికి సోనియా, ఖర్గే దూరం

అయోధ్యలో రామ మందిర్ ప్రారంభోత్సవానికి దూరంగా ఉండాలని కాంగ్రెస్  నిర్ణయించుకుంది.   ఏఐసీసీ ఛీప్ మల్లికార్జున ఖర్గే,  సోనియాగాంధీ, అదిర్ రంజన్ చౌదరి  హాజరు కావడం లేదని కాంగ్రెస్  ప్రకటించింది.  నిర్మాణాలు పూర్తికాకుండానే రాజకీయ లబ్ధి కోసమే రామ్ మందిర్ ప్రారంభిస్తున్నారని విమర్శించారు.  బీజేపీ, ఆర్ఎస్ఎస్  రాజకీయ లబ్ధి కోసమే కార్యక్రమం నిర్వహిస్తున్నారని ధ్వజమెత్తారు.  కోట్లాది మంది సెంటిమెంట్ ను తాము  గౌరవిస్తాం..  అయోధ్యపై రాజకీయాన్ని  మాత్రమే తాము వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. 

రాముడిని దేశంలో లక్షలాది మంది పూజిస్తారు కానీ. మతం అనేది వ్యక్తిగత విషయం. కానీ ఆర్ఎస్ఎస్ , బీజేపీ  చాలా కాలంగా అయోధ్యలోని ఆలయాన్ని రాజకీయ ప్రాజెక్టుగా తయారు చేశారని ఆరోపించారు.  అసంపూర్తిగా నిర్మించిన అయోధ్యను బీజేపీ,ఆర్ఎస్ఎస్  ప్రారంభించడం ఎన్నికల లబ్ధికోసమే ముందు ప్రారంభిస్తున్నారని స్పష్టమవుతోంది. అయితే తాము 2019 సుప్రీం కోర్టుకు కట్టుబడి ఉంటామని కాంగ్రెస్ ఓ ప్రకటనలో తెలిపింది. 

జనవరి 22న ప్రారంభం కానున్న అయోధ్య రామ మందిర్ ప్రారంభానికి హాజరుకావాల్సిందిగా మల్లికార్జున ఖర్గే, సోనియగాంధీ,  అధిర్ రంజన్ చౌదరికి ఆహ్వానం అందింది.   ఈ క్రమంలో హాజరుకావడం లేదని ప్రకటించింది.