ఖమ్మం జిల్లా వ్యాప్తంగా గ్రాండ్గా సోనియా గాంధీ బర్త్డే

ఖమ్మం జిల్లా వ్యాప్తంగా గ్రాండ్గా సోనియా గాంధీ బర్త్డే

వెలుగు, నట్​వర్క్​: ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మంగళవారం ఏఐసీసీ నాయకురాలు సోనియాగాంధీ బర్త్​డేను గ్రాండ్​గా సెలబ్రేట్​ చేశారు. ఖమ్మంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ, నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నాగండ్ల దీపక్ చౌదరి, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు, జిల్లా కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, మధిరలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సూరంశెట్టి కిషోర్,  మిర్యాల వెంకటరమణ గుప్తా, పాల్వంచలో పాల్వంచ కో-ఆపరే టివ్ సొసైటీ చైర్మన్, మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాస పాల్గొన్నారు.  

కేక్ కట్ చేసి, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  కాంగ్రెస్ పార్టీకి అండగా, దేశ ప్రజాస్వామ్య విలువలకు అచంచల కట్టుబాటుతో సేవలందిస్తూ భారత రాజకీయాల్లో అత్యున్నత స్థానాన్ని సంపాదించిన కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు  సోనియా గాంధీ అన్నారు.