కరోనా రోగిని ఫ్లైట్‌లో తరలించిన సోనూ సూద్

కరోనా రోగిని ఫ్లైట్‌లో తరలించిన సోనూ సూద్

హైదరాబాద్: కరోనా క్రైసిస్‌లో కష్టాలు పడుతున్న ఎంతోమందికి ప్రముఖ నటుడు సోనూ సూద్ అండగా నిలిచాడు. ఫస్ట్‌‌వేవ్‌‌తో పాటు ఇప్పుడు సెకండ్ వేవ్‌‌ సమయంలోనూ అవిశ్రాంతంగా, నిస్వార్థంగా పేదవారి కోసం పనిచేస్తుండటం సోనూ సేవాగుణానికి సాక్ష్యంగా చెప్పొచ్చు. తాజాగా కరోనాతో బాధపడుతున్న ఓ రోగిని ప్రత్యేక చికిత్స కోసం నాగ్‌పూర్ నుంచి హైదరాబాద్‌కు ఎయిర్ అంబులెన్స్‌ విమానంలో సోనూ పంపించారు.

కరోనా కారణంగా భారతి అనే అమ్మాయి దాదాపుగా 85-90% ఊపిరితిత్తులను కోల్పోయింది. సోనూ ఆమెను నాగ్‌పూర్‌లోని వోక్‌హార్ట్ ఆస్పత్రికి తరలించారు. ఆమెకు ఊపిరితిత్తుల మార్పిడి లేదా ప్రత్యేక చికిత్స అవసరమని వైద్యులు చెప్పారు. ఇది హైదరాబాద్‌‌‌లోని అపోలో హాస్పిటల్‌‌లోనే సాధ్యమని తెలిసి వెంటనే అపోలో ఆస్పత్రుల డైరెక్టర్లతో సోనూ సంప్రదింపులు జరిపారు. ట్రీట్‌‌మెంట్‌‌లో భాగంగా ECMO చికిత్స కోసం సెటప్ హైదరాబాద్ నుంచి 6 మంది వైద్యులతో ఒకరోజు ముందుగానే రావాలి.  ఇందుకోసం ఎయిర్ అంబులెన్స్ ఏర్పాటు చేశారు.  హైదరాబాద్‌‌లోని అపోలో హాస్పిటల్‌‌లో భారతికి ట్రీట్‌మెంట్ అందించారు. భారతికి చికిత్స బాగా జరుగుతోదని, ఆమె కోలుకొని త్వరలో తిరిగి వస్తుందని సోనూ చెప్పారు’