
యాక్టర్ సోనూ సూద్ రోడీస్ 18వ సీజన్‌కి హోస్ట్‌గా చేయనున్నాడు. రోడీస్ అనేది ఒక స్టంట్ రియాలిటీ షో. ఇందులో మిగతా రియాలిటీ షోల లాగానే ఎలిమినేషన్, ఓటింగ్, ట్విస్ట్‌లు ఉంటాయి. ‘‘రోడీస్తో నా జీవితంలో కొత్త అడ్వెంచర్ మొదలైంది. ఇందులో ఫన్‌తో పాటు అడ్వెంచరస్ యాక్టివిటీస్ ఉన్నందుకు చాలా ఎగ్జైటింగ్‌గా ఉంది. ఈ సీజన్లో దేశంలోని బెస్ట్ రోడీస్ పార్టిసిపేట్ చేస్తున్నారు. అనుకున్నట్టుగానే ఈ జర్నీ థ్రిల్లింగ్‌గా ఉండబోతోంది”అని ట్విట్టర్లో పోస్ట్ చేశాడు సోను. ఈ కొత్త సీజన్ షూటింగ్ దక్షిణాఫ్రికాలో జరగనుంది. ఈ నెల రెండో వారంలో షూటింగ్ స్టార్ట్ అవుతుంది. మార్చిలో ఎమ్ టీవీలో ఈ షో టెలికాస్ట్ అవుతుంది.