చిన్నారి కళ్లలోని చూపు అమూల్యమైంది

చిన్నారి కళ్లలోని చూపు అమూల్యమైంది

సోనూ సూద్ రియల్ హీరో అంటున్నాడు తెలంగాణ వాసి. తన కుమార్తెతో కలిసి బైక్ పై సోనూ సూద్ ఇంటికి వెళ్లాడు. ఈ విషయాన్ని సోనూసూద్ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో నివాసం ఉండే ఇతను కోమాలో కొన్ని రోజులు ఉండిపోయాడు. అతడిని బతికించే విధంగా ఏర్పాట్లు చేశారు సోనూ సూద్. ప్రస్తుతం అతను కోలుకున్నాడు. దీంతో సోనూకు కృతజ్ఞతలు తెలిపేందుకు బైక్ పై తన కుమార్తెతో కలిసి అతని ఇంటికి వెళ్లాడు. తండ్రి, కుమార్తెలిద్దరూ సోనూ సూద్ రియల్ హీరో పేరిట ఉన్న టీషర్టులను ధరించారు. జై సోనూ సూద్ అంటూ ఓ జెండాను బైక్ పై ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సోనూ సూద్ తన సోషల్ మీడియాలో ఈ విషయాన్ని పోస్టు చేశారు.

తెలంగాణకు చెందిన రామ్ ప్రసాద్ భండారి, అతని కుమార్తె తన ఇంటికి వచ్చారన్నారు. కొంతకాలం క్రితం అతను కోమాలో ఉన్నట్లు.. తాము సహాయం చేయడం జరిగిందన్నారు. అతని జీవితాన్ని రక్షించినట్లు వెల్లడించారు. చిన్నారి కళ్లలోని చూపు అమూల్యమైందని.. సంతోషంగా నిలబడిందన్నారు. మరింత కష్టపడి పని చేయడానికి ఇలాంటి క్షణాలే ప్రేరణ అని చెప్పారు. బాలీవుడ్ నటుడు సోనూ సూద్ పలు సినిమాల్లో విలన్ పాత్రలకు ప్రసిద్ధి. కానీ.. నిజ జీవితంలో మాత్రం హీరో అయ్యాడు. కరోనా కారణంగా అష్టకష్టాలు పడిన వారికి చేతనైనంత సహాయం చేశాడు. ఎన్నో ప్రాణాలను కాపాడాడు. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడానికి ఈ రియల్ హీరో ఎప్పుడూ ముందుంటాడు. సూద్ ఛారిటీ ఫౌండేషన్ ద్వారా చాలా మందికి హెల్ప్ చేస్తున్నాడు. బాధితులకు ఒక ఆపద్బాందవుడిలా మారిపోయాడు. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sonu Sood (@sonu_sood)