విల‌న్ కాదు.. హీరో అనిపించుకున్నాడు

విల‌న్ కాదు.. హీరో అనిపించుకున్నాడు

సినిమాల్లో విలన్ వేషాలు వేసే సోనూసూద్.. ఇపుడు నిజ జీవితంలో రియల్ హీరో అనిపించుకున్నాడు. కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలులో ఉంది. దీంతో చాలా మంది కార్మికులకు పని లేకుండా పోయింది. అందులో సినీ కార్మికులు కూడా ఉన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా డాక్టర్లు, నర్సులు, పోలీసులు, మీడియా, పారిశుద్ధ కార్మికులు, జల మండలి, విద్యుత్ వంటి అత్యవసర సేవలు మాత్రం నిరంతరాయంగా పనిచేస్తున్నాయి.

ఈ సందర్బంగా సోనూసూద్.. కరోనా వైరస్‌పై పోరాటం చేస్తున్న వైద్యులకు, నర్సులకు, వైద్య బృందాలకు ముంబాయిలోని జుహు ప్రాంతంలోని తన హోటల్‌ ను వాడుకోవడాని ఇచ్చేస్తున్నట్టు తెలిపాడు. వాళ్ళు ఎక్కడినుంచో వచ్చి ఉంటారని, వారిని జాగ్రత్తగా చూసుకోవడం మన బాధ్యత అని.. తన హోటల్‌ ఇలా ఉపయోగపడుతున్నందుకు సంతోషంగా ఉందని సోనూ సూద్ తెలిపాడు.

సోనూసూద్ చేసిన పనిని చూసి సోషల్ మీడియాలో నెటిజన్స్ మెచ్చుకుంటున్నారు. ఇప్పటికే కరోనాపై పోరాటంలో ఆ ఇండస్ట్రీ, ఈ ఇండస్ట్రీ అనే తేడా లేకుండా అందరు తమ వంతు సహకారం అందిస్తున్న విష‌యం తెలిసిందే.