హర్భజన్ సింగ్ కు సహాయం అందించిన సోనూసూద్ 

 హర్భజన్ సింగ్ కు సహాయం అందించిన సోనూసూద్ 

సోనూసూద్.. కరోనా విపత్కర సమయంలో అందరూ చేతులెత్తేసి నిస్సహాయత వ్యక్తం చేస్తే.. నేనున్నానంటూ స్పందించి ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాడు.  ప్రజలు.. సాధారణ పౌరులే కాదు.. సెలబ్రిటీలు సైతం నిస్సహాయ స్థితిలో సహాయం అడిగినా సోనూసూద్ వెంటనే స్పందించి సాయం అందిస్తూ శభాష్ అనిపించుకుంటున్నాడు. ఇటీవల సురేష్ రైనా సైతం సోనూసూద్ నుంచి సాయం అందుకోగా లేటెస్ట్‌గా మరో ఇండియన్ క్రికెటర్‌ హర్భజన్ సింగ్ కు సైతం అడగ్గానే సాయం చేశాడు సోనూసూద్. కరోనా తొలి వేవ్ సమయంలో వలస కార్మికులను సొంత ఊళ్లకు పంపడానికి స్పెషల్‌గా రవాణా సౌకర్యాలను ఏర్పాటు చేసి సాయం చేసి ప్రపంచ వ్యాప్తంగా రియల్ హీరోగా మన్ననలు అందుకున్న సోనూసూద్.. ఇప్పుడు తాజాగా  సెకండ్ వేవ్ సమయంలో ఆస్పత్రిలో బెడ్లు, ఆక్సిజన్, ప్లాస్మా, ఇంజెక్షన్.. ఇలా ప్రతీ విషయంలో సాయం చేసి నయా మెస్సయ్యగా మారిపోయారు. ఈ క్రమంలోనే టీమిండియా మాజీ క్రికెటర్, స్పిన్నర్ హర్భజన్ సింగ్ తనకు తెలిసినవారికి ఒకరికి రెండిసివర్ ఇంజెక్షన్ కావాలని దండం పెడుతూ సహాయం కోరగా.. సోనూసూద్‌ను అడగాలంటూ ఫాలోవర్స్ ట్యాగ్ చేశారు. వెంటనే స్పందించిన సోనూసూద్.. తప్పకుండా సహాయం అందుతుందంటూ భరోసా ఇచ్చేశాడు. కర్ణాటకలో అవసరమైన వ్యక్తులకు ఇంజెక్షన్ అందుతుంది అని చెప్పగా.. హర్బజన్ ధన్యవాదాలు సోదరా.. దేవుడు ఆశీస్సులతో మీరు బాగుండాలి అని హర్భజన్ సింగ్ ఆశీర్వదించారు.