హాస్పిటళ్లో ఆక్సిజన్ లీక్.. పేషంట్లను కాపాడిన సోనూ టీం

హాస్పిటళ్లో ఆక్సిజన్ లీక్.. పేషంట్లను కాపాడిన సోనూ టీం

కరోనా కేసులు పెరగడంతో ఆక్సిజన్‌కు ఫుల్ డిమాండ్ పెరిగింది. దాంతో ఏ హాస్పిటళ్లో చూసినా ఆక్సిజన్ సిలిండర్లే దర్శనమిస్తున్నాయి. పేషంట్ల కోసం ఆస్పత్రులు ఆక్సిజన్‌ను నిల్వచేసుకుంటున్నాయి. అయితే కొన్ని సందర్భాల్లో ఆక్సిజన్ లీక్ అయి ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా బెంగుళూరులోని శ్రేయాస్ ఆస్పత్రిలో కూడా ఆక్సిజన్ లీకైంది. వెంటనే అప్రమత్తమైన హాస్పిటల్ డాక్టర్ సమిత్ హవినల్ సాయం కోరుతూ సోనూ‌సూద్ ఫౌండేషన్ మరియు పోలీసు హెల్ప్‌లైన్‌ను సంప్రదించారు. వెంటనే సోనూ‌సూద్ ఫౌండేషన్ స్థానికంగా ఉన్న సభ్యులను స్పందించాల్సిందిగా కోరింది. వెంటనే ఫౌండేషన్ సభ్యులు తగినన్ని ఆక్సిజన్ సిలిండర్లతో ఆస్పత్రికి చేరుకున్నారు. లీకేజీని ఆపడానికి దాదాపు గంట వరకు ఆక్సిజన్ సప్లై ఆపారు. ఆ సమయంలో ఫౌండేషన్ సభ్యులు తీసుకొచ్చిన ఆక్సిజన్ సిలిండర్లను ఉపయోగించి పేషంట్లకు ఆక్సిజన్ అందించారు. దాంతో దాదాపు 30 మంది కరోనా పేషంట్ల ప్రాణాలు దక్కాయి. సమయానికి సిలిండర్లతో ఫౌండేషన్ సభ్యులు రాకపోయుంటే.. పేషంట్లు చనిపోయేవారని ఆ ఆస్పత్రి సీనియర్ వైద్యుడు తెలిపారు. లాక్‌డౌన్‌తో ఇబ్బంది పడుతున్న సామాన్యులకు సాయం చేయడంతో పాటు.. కరోనా రోగులకు కూడా సోనూ‌సూద్ తన ఫౌండేషన్ ద్వారా సాయమందిస్తూ హీరోగా నిలుస్తున్నారు.