త్వరలో ఎల్‌ఐసీ పబ్లిక్‌ ఇష్యూ

త్వరలో ఎల్‌ఐసీ పబ్లిక్‌ ఇష్యూ

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో ఎల్‌ఐసీ (భారత బీమా సంస్థ) పబ్లిక్ ఇష్యూ (ఐపీవో) గురించి ప్రస్తావించారు. త్వరలోనే ఎల్‌ఐసీ పబ్లిక్ ఇష్యూకు రాబోతున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఎయిర్‌‌ ఇండియా, నీలాంచల్‌ నిస్పా‌ట్​ నిగమ్‌ లిమిటెడ్‌ను డిజిన్వెస్ట్‌మెంట్ పూర్తయినట్లు నిర్మలమ్మ చెప్పారు. తమ ప్రభుత్వం పౌరుల ప్రయోజనాలే లక్ష్యంగా ఎకానమీలో సంస్కరణలు ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు. రాబోయే 25 ఏళ్ల (అమృత్ కాల్‌) ప్లాన్‌తో ఈ రిఫార్మ్స్‌ తీసుకొస్తున్నామన్నారు. ప్రస్తుతం మనం 75 ఏళ్ల స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌గా జరుపుకొంటున్నామని, ఈ ఏడాది బడ్జెట్‌ రాబోయే 25 ఏళ్లలో ఆర్థికాభివృద్ధికి అవసరమైన పునాదిని వేసే బ్లూ ప్రింట్‌గా ఉంటుందని నిర్మలా సీతారామన్ చెప్పారు.