
జీడిమెట్ల, వెలుగు: సైబరాబాద్కమిషనరేట్పరిధిలో బెల్టు షాపులపై ఎస్ ఓటీ పోలీసుల దాడులు చేశారు. అక్రమంగా అమ్ముతున్న మద్యాన్ని స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. పేట్‌బషీరాబాద్, బాచుపల్లి, దుండిగల్, శామీర్‌పేట్, మోకీలా, రాజేంద్రనగర్, మైలార్దేవుపల్లి, నందిగామ, పోలీస్ స్టేషన్ల పరిధిలోని బెల్ట్ షాపులపై గురువారం పోలీసులు దాడి చేశారు. మొత్తం రూ.7.47 లక్షల విలువైన 796 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకుని సీజ్ చేసినట్టు పోలీసులు తెలిపారు.