V6 News

దాదాను రాజకీయంగా వాడుకుందామని చూస్తున్నారు

దాదాను రాజకీయంగా వాడుకుందామని చూస్తున్నారు
కోల్‌‌‌కతా: టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి గుండె పోటు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దాదా హెల్త్ స్టేబుల్‌‌గా ఉందని ఆయనకు ట్రీట్‌‌మెంట్ అందిస్తున్న వుడ్‌‌ల్యాండ్స్ హాస్పిటల్ డాక్టర్లు వెల్లడించారు. ఈ విషయాన్ని పక్కనబెడితే.. గంగూలీపై రాజకీయాల్లోకి రావాలన్న ఒత్తిడి ఉందని వెటరన్ సీపీఐ నేత అశోక్ భట్టాచార్య అన్నారు. కొందరు తమ పొలిటికల్ అవసరాల కోసం దాదాను రాజకీయాల్లోకి లాగారని యత్నిస్తున్నారని తెలిపారు. ఈ ఏడాది బెంగాల్‌‌లో అసెంబ్లీ ఎన్నికల జరగనున్న నేపథ్యంలో దాదాను రాజకీయంగా వాడుకోవాలని కొందరు యత్నించారని చెప్పారు. అయితే పొలిటికల్ ఎంట్రీపై దాదా ఇప్పటివరకు ఎప్పుడూ మాట్లాడకపోవడం గమనార్హం. ‘కొందరు నేతలు గంగూలీని రాజకీయంగా వాడుకుందామని భావించారు. అది ఆయన మీద ఒత్తిడి తీసుకొచ్చి ఉండొచ్చు. ఆయనో రాజకీయ అంశం కాదు. సౌరవ్‌‌ను ఎప్పుడూ క్రీడారంగపు ఐకాన్‌‌గా గుర్తుండాలి. రాజకీయాల్లో జాయిన్ అవ్వమని ఆయనపై ఒత్తిడి తీసుకురావొద్దు. పాలిటిక్స్‌‌లో రావొద్దని గత వారమే గంగూలీకి సూచించా. నా అభిప్రాయాలకు ఆయన అడ్డు చెప్పలేదు. లక్షలాది అభిమానుల్లాగే గంగూలీ త్వరగా కోలుకోవాలని నేనూ ప్రార్థిస్తున్నా’ అని భట్టాచార్య పేర్కొన్నారు.