9 పరుగుల తేడాతో సౌతాఫ్రికా విజయం

9  పరుగుల తేడాతో సౌతాఫ్రికా విజయం

సౌతాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో భారత్ ఓటమి చవిచూసింది.  250 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమ్ఇండియా నిర్ణీత 40 ఓవర్లలో ఎనిమిది వికెట్లు నష్టపోయి  240 పరుగులు చేసింది.  దీంతో9  పరుగుల తేడాతో సఫారీలు విజయం సాధించారు. టీమ్ఇండియాలో  సంజూ శాంసన్ (86 నాటౌట్) , శ్రేయస్ అయ్యర్ (50), శార్దుల్ (33) పరుగులు చేశారు.  సౌతాఫ్రికా బౌలర్లలో ఎంగిడి3, రబాడా 2, పార్నెల్ 1, కేశవ్ మహరాజ్ 1, తబ్రైజ్ షంసీ 1 వికెట్ తీశారు.  

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన  సౌతాఫ్రికా 4 వికెట్లు కోల్పోయి 249 పరుగులు సాధించింది. హెన్రిచ్ క్లాసెన్ (74 నాటౌట్‌), డేవిడ్ మిల్లర్( 75 నాటౌట్) పరుగులతో రాణించడంతో సౌతాఫ్రికా భారీ స్కోర్ చేయగలిగింది.  ప్రస్తుతం మూడు వన్డేల సీరిస్ లో సౌతాఫ్రికా 10 తో ముందంజలో ఉంది. ఇరు జట్ల మధ్య అక్టోబర్ 9న రాంచీలో రెండో వన్డే జరగనుంది.