తొలి టీ20లో రెచ్చిపోయిన టీమిండియా బౌలర్లు

తొలి టీ20లో రెచ్చిపోయిన టీమిండియా బౌలర్లు

సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి  టీ20లో టీమిండియా బౌలర్లు రెచ్చిపోయారు. 3 ఓవర్లకే 5 వికెట్లు తీసి ఔరా అనిపించారు. తొలి ఓవర్ లోనే  సౌతాఫ్రికా కెప్టెన్ బవుమా అవుటయ్యాడు. దీపక్ చాహర్ వేసిన ఈ ఓవర్లో బవుమా క్లీన్ బౌల్డయ్యాడు. సెకండ్ ఓవర్ వేసిన అర్షదీప్ సింగ్ 3 వికెట్లు పడగొట్టి సఫారీలను కోలుకోలేని దెబ్బతీశాడు. డికాక్, రోసోవ్, డేవిడ్ మిల్లర్ లను పెవిలియన్కు పంపించాడు. ఆ తర్వాత ఓవర్ వేసి దీపక్ చాహర్ ట్రిస్టన్ స్టబ్స్ ను ఔట్ చేశాడు. దీంతో సౌతాఫ్రికా 3 ఓవర్లకే 5వికెట్లు నష్టపోయింది.

అంతకుముందు టాస్ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ సిరీస్‌కు హార్దిక్, భువనేశ్వర్ దూరమవ్వగా..వారి స్థానంలో పంత్, అర్షదీప్ క్రీజులోకి వచ్చారు. అదేవిధంగా బుమ్రా స్థానంలో దీపక్ చాహర్‌, చాహల్ స్థానంలో అశ్విన్  ఆడుతున్నారు.