
ఇండియా, శ్రీలంక సంయక్తంగా ఆతిధ్యమిస్తున్న మహిళల వన్డే ప్రపంచ కప్ కి సౌతాఫ్రికా స్క్వాడ్ వచ్చేసింది. బుధవారం (సెప్టెంబర్ 3) 15 మందితో కూడిన మహిళా జట్టును సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు ప్రకటించింది. లారా వోల్వార్డ్ట్ జట్టుకు కెప్టెన్సీ చేయనుంది. ఇటీవలే ఐసీసీ టోర్నీల్లో వరుసగా నాకౌట్ కు ఓడిపోతున్న సౌతాఫ్రికా జట్టు ఈ సారి ఇండియాలో జరగబోయే వరల్డ్ కప్ ఎలాగైనా కొట్టాలని గట్టి పట్టుదలతో కనిపిస్తోంది. 17 ఏళ్ల వికెట్ కీపర్-బ్యాటర్ కరాబో మెసో స్క్వాడ్ లో చోటు సంపాదించుకోవడం విశేషం.
కరాబో మెసో తొలిసారి ఐసీసీ టోర్నీ ఆడబోతుంది. ఇప్పటివరకు రెండు వన్డేలు, 5 టీ20 మ్యాచ్ లు ఆడింది. మెసో 2023, 2025లో జరిగిన అండర్-19 టీ20 వరల్డ్ కప్ లో జూనియర్ మహిళల జట్టుకు ప్రాతినిధ్యం వహించింది. జట్టులోని సీనియర్ సినాలో జాఫ్తాకు మెసో బ్యాకప్‌గా ఉంటుంది. మారిజాన్ కాప్, సునే లూస్ నాడిన్ డి క్లెర్క్‌లు ఆల్ రౌండర్ గా సత్తా చాటడానికి సిద్ధంగా ఉన్నారు. అయబొంగా ఖాకా, మసాబాటా క్లాస్, మారిజాన్ కాప్ లతో ఫాస్ట్ బౌలింగ్ విభాగం పటిష్టంగా కనిపిస్తోంది. రిటైర్మెంట్ వెనక్కి తీసుకున్న మాజీ కెప్టెన్ డేన్ వాన్ నీకెర్క్ కు స్క్వాడ్ లో స్థానం లభించలేదు.
అక్టోబర్ 3న గౌహతిలో సౌతాఫ్రికా ఇంగ్లాండ్‌తో తన తొలి మ్యాచ్ తో వరల్డ్ కప్ ప్రచారాన్ని ప్రారంభిస్తుంది. బర్సపారా క్రికెట్ స్టేడియంలోసఫారీలకు ఇదే ఏకైక మ్యాచ్. ఆ తర్వాత సౌతాఫ్రికా తాము ఆడబోయే ఆరు మ్యాచ్‌లు ఇండోర్, వైజాగ్, కొలంబోలో ఆడనున్నారు. "ఇటీవల జరిగిన ఐసీసీ ఉమెన్స్ ఛాంపియన్‌షిప్ సైకిల్‌లో నిలకడగా ఆడిన ప్లేయర్లను ఎంపిక చేశాం. ఉపఖండ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని జట్టును సెలక్ట్ చేశాం". అని క్రికెట్ సౌతాఫ్రికా సెలెక్టర్ల కన్వీనర్ క్లింటన్ డు ప్రీజ్ అన్నారు.
ALSO READ : 45 ఓవర్లలోనే వన్డే మ్యాచ్ ఫినిష్.. సౌతాఫ్రికా చేతిలో ఘోరంగా ఓడిన ఇంగ్లాండ్
ఇండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్ .. ఈ జట్లు వరల్డ్ కప్ కోసం పోటీ పడనున్నాయి. ఆస్ట్రేలియా డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతోంది. సొంత దేశంలో టోర్నీ కావడంతో భారత్ హాట్ ఫేవరెట్. భారత్ చివరగా 2013లో ప్రపంచ్ కప్‌కు ఆతిథ్యం ఇవ్వగా.. ఈ టోర్నీలో ఇండియా ఉమెన్స్ టీమ్ గ్రూప్ దశలోనే నిష్క్రమించింది.
దక్షిణాఫ్రికా మహిళల ప్రపంచ కప్ 2025 జట్టు:
లారా వోల్వార్డ్ట్ (కెప్టెన్), అన్నేకే బాష్, తజ్మిన్ బ్రిట్స్, నాడిన్ డి క్లెర్క్, అన్నరీ డెర్క్‌సెన్, సినాలో జాఫ్తా, మారిజాన్ కాప్, అయాబొంగా ఖాకా, మసాబాటా క్లాస్, సునే లూస్, కరబోకులు మెసో, నోలాన్‌బాకులు మెసో, నోండుమిసో షాంగసే, మరియు క్లో ట్రయాన్
17- year-old wicket-keeper batter Karabo Meso will play her first World Cup - how does the squad look, 🇿🇦 fans? pic.twitter.com/9pSny4THzK
— ESPNcricinfo (@ESPNcricinfo) September 3, 2025