WTC Final: మా ఆశలు మోసే జట్టు ఇదే.. WTC ఫైనల్‌కు సౌతాఫ్రికా స్క్వాడ్‌ ఇదే

WTC Final: మా ఆశలు మోసే జట్టు ఇదే.. WTC ఫైనల్‌కు సౌతాఫ్రికా స్క్వాడ్‌ ఇదే

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా జట్ల మధ్య జూన్ 11 నుంచి 15 మధ్య జరగనుంది.  ఈ  మెగా ఫైనల్ కు  సౌతాఫ్రికా స్క్వాడ్ వచ్చేసింది. మంగళవారం (మే 13) 15 మంది ఆటగాళ్ల జట్టును సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బావుమా వీడియో ద్వారా ప్రకటించాడు. "మా ఆశలను మోసే జట్టు ఇదే" అని బావుమా వీడియోలో అన్నారు. బవుమా కెప్టెన్ గా తన బాధ్యతలను స్వీకరిస్తాడు. వైస్ కెప్టెన్ గా ఎవరి పేరు ప్రకటించలేదు.

కగిసో రబాడ, మార్కో జాన్సెన్, డేన్ పాటర్సన్, వియాన్ ముల్డర్, కార్బిన్ బాష్ వంటి పేసర్లతో ఫాస్ట్ బౌలింగ్ లైనప్ పటిష్టంగా కనిపిస్తుంది. వీరికి తోడు లుంగీ ఎన్గిడి స్క్వాడ్ లో చోటు దక్కించుకున్నాడు. ఎన్గిడి చివరిసారిగా 2024 అక్టోబర్ లో సౌతాఫ్రికా. గాయం నుంచి కోలుకొని ప్రస్తుతం ఐపీఎల్ లో 2025 లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్ సీబీ) జట్టు తరపున ఆడుతున్నాడు. బ్యాటింగ్ లో కెప్టెన్ బావుమాతో పాటు.. ఐడెన్ మార్క్రామ్, టోనీ డి జోర్జీ, ర్యాన్ రికెల్టన్, ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ బెడింగ్‌హామ్ సత్తా చాటడానికి సిద్ధంగా ఉన్నారు. వికెట్ కీపర్ గా కైల్ వెర్రెయిన్ కొనసాగనున్నాడు. కేశవ్ మహారాజ్, సేనురాన్ ముత్తుస్వామి రూపంలో జట్టులో ఇద్దరు స్పిన్నర్లు ఉన్నారు. 

ఆస్ట్రేలియా టెస్ట్ స్క్వాడ్ ప్రకటించిన కాసేపటికి సౌతాఫ్రికా తమ జట్టును ప్రకటించడం విశేషం. జూన్ 11 నుంచి 15 మధ్య ఫైనల్  జరగనుంది. జూన్ 16ని రిజర్వ్ డేగా కేటాయించారు. వరుసగా మూడోసారి ఈ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ ఇంగ్లాండ్ లోనే జరగబోతుంది. డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగుతున్న ఆస్ట్రేలియా 2023 ఓవల్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్ లో 229 పరుగుల భారీ తేడాతో భారత్ ను ఓడించింది. ఆస్ట్రేలియా వరుసగా రెండో సారి టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కు అర్హత సాధించగా.. సౌతాఫ్రికాకు ఇదే తొలిసారి.  

టెస్ట్ ఛాంపియన్స్ షిప్ 2025 ఫైనల్‌కు దక్షిణాఫ్రికా జట్టు

టెంబా బావుమా (కెప్టెన్), టోనీ డి జోర్జి, ఐడెన్ మార్క్‌రామ్, వియాన్ ముల్డర్, మార్కో జాన్సెన్, కగిసో రబడ, కేశవ్ మహరాజ్, లుంగి ఎన్గిడి, కార్బిన్ బాష్, కైల్ వెర్రెయిన్ (వికెట్ కీపర్), డేవిడ్ బెడింగ్‌హామ్, ట్రిస్టన్ స్టబ్స్, ర్యాన్ రికెల్టన్, సెనూర్న్ రికెల్టన్