నైట్ క్లబ్ లో 21 మంది అనుమానస్పద మృతి

నైట్ క్లబ్ లో 21 మంది అనుమానస్పద మృతి

సౌతాఫ్రికాలో ఓ టౌన్ షిప్ లో జరిగిన నైట్ క్లబ్ లో 21 మంది టీనేజర్స్ చనిపోయారు. అయితే వీళ్లు ఎలా మృతిచెందారనే దానిపై క్లారిటీ లేదు. చనిపోయిన వారిలో 13 మంది అబ్బాయిలు, 8 మంది అమ్మాయిలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. 17 మంది స్పాట్ లోనే చనిపోగా... మిగతా నలుగురు హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటూ మృతి చెందినట్లు చెప్పారు. ఘటనా స్థలంలో ఖాళీ మద్యం బాటిళ్లు, విగ్గులు, పాస్టెల్ పర్పుల్ హ్యాపీ బర్త్ డే చీరలను గుర్తించారు.

చనిపోయిన వారంతా శనివారం రాత్రి స్కూల్లో ఎగ్జామ్స్ ముగియటంతో సంబరాలు చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాలపై ఎలాంటి గాయాలు లేవని అంటున్నారు. నైట్ క్లబ్ లో చాలామంది ఉండటంతో తొక్కిసలాట జరిగిందా... లేదా ఏదైనా విష ప్రయోగమా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 21 మంది ఎలా చనిపోయారన్నది పోస్టుమార్టం రిపోర్టులోనే తెలుస్తుందని అంటున్నారు. చనిపోయిన వారంతా 13,14 సంవత్సరాల వయస్సువారే.  ఘటనా స్థలంలో మృతుల తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. ఘటనపై సౌతాఫ్రికా అధ్యక్షుడు సిరల్ రామఫోసా సంతాపాన్ని ప్రకటించారు. ఆఫ్రికా దేశాల్లో ఎక్కువగా మద్యం సేవించే దేశాల్లో సౌతాఫ్రికా ఒకటి. అయితే 18 ఏళ్లలోపు వారికి మద్యం విక్రయించడాన్ని ఉల్లంఘించినందుకు క్లబ్ యజమానిపై చర్యలు తీసుకుంటామన్నారు పోలీసులు.