Telangana Kabaddi: తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ (టీకేఏ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలంగాణ ‘ఎ’ డివిజన్ లీగ్ ఇంటర్ డిపార్ట్‌మెంట్ కబడ్డీ చాంపియన్‌షిప్ పోటీల్లో సౌత్ సెంట్రల్ రైల్వే జట్టు బోణీ చేసింది. గురువారం జరిగిన తొలి మ్యాచ్‌లో సౌత్ సెంట్రల్ రైల్వే టీమ్ 46–25తో తెలంగాణ పోస్టల్ జట్టుపై నెగ్గింది. ఆట ఆరంభం నుంచి సౌత్ ప్లేయర్లు వరుస పాయింట్లతో హోరెత్తించారు.
మీర్‌పేట్ మున్సిపల్ గ్రౌండ్‌లో మొదలైన పోటీలు ఈ నెల 30 వరకు జరగనున్నాయి. ఈ చాంపియన్‌షిప్‌లో వివిధ ప్రభుత్వ శాఖలు, బ్యాంకులు, క్రీడా సంస్థలకు చెందిన 10 జట్లు పాల్గొంటున్నాయి. పూల్–ఎలో సౌత్ సెంట్రల్ రైల్వే, తెలంగాణ రాష్ట్ర పోలీస్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (హైదరాబాద్), తెలంగాణ క్రీడాప్రాధికార సంస్థ (శాట్), తెలంగాణ పోస్టల్ జట్లు ఉన్నాయి.
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్), ఇన్‌కమ్ ట్యాక్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (అమరావతి), తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ టీమ్స్ పూల్–బిలో పోటీపడుతున్నాయి. పోటీల ప్రారంభోత్సవంలో తెలంగాణ కబడ్డీ సంఘం ప్రధాన కార్యదర్శి మహేందర్ రెడ్డి, రాష్ట్ర ఒలింపిక్ సంఘం కార్యదర్శి పి. మల్లారెడ్డి, మాజీ కార్యదర్శి జగదీశ్వర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
