కోట్ల ఉదయనాథ్-కు బ్రాంజ్‌‌ డిస్క్‌‌ అవార్డు

కోట్ల ఉదయనాథ్-కు బ్రాంజ్‌‌ డిస్క్‌‌ అవార్డు
  • సౌత్ సెంట్రల్ రైల్వేకు చేసిన సేవలకుగాను దక్కిన పురస్కారం

హైదరాబాద్, వెలుగు: సౌత్ సెంట్రల్ రైల్వే సివిల్ డిఫెన్స్ కంట్రోలర్, డిప్యూటీ జనరల్ మేనేజర్ (జనరల్) కోట్ల ఉదయనాథ్ కు ప్రతిష్టాత్మక “డైరెక్టర్ జనరల్ డిస్క్ (బ్రాంజ్)” అవార్డు లభించింది. 63వ సివిల్ డిఫెన్స్ రైజింగ్ డే సందర్భంగా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఈ పురస్కారం ప్రదానం చేసింది. సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ వ్యాప్తంగా సివిల్ డిఫెన్స్ సన్నద్ధత, విపత్తు నిర్వహణ, సమన్వయంలో ఉదయనాథ్ చూపిన నాయకత్వం, సృజనాత్మకత, అంకితభావం ఈ జాతీయ గౌరవానికి కారణమయ్యాయి.–

 18 వేలకు పైగా రైల్వే సిబ్బందికి బేసిక్- రిఫ్రెషర్ శిక్షణ, అవగాహన కార్యక్రమాలను ఉదయనాథ్ నిర్వహించారు. ఎన్డీఆర్ఎఫ్, ఆర్ఫీఎఫ్, ఆక్టోపస్ తో కలిసి రైల్వే ప్రమాదాలపై మాక్ డ్రిల్స్, ఆపరేషన్ షీల్డ్ (సిందూర్) వంటి కీలక డ్రిల్స్ చేపట్టారు. మొదటి జోనల్ సివిల్ డిఫెన్స్ కాన్ఫరెన్స్, ఎస్సీఆర్ విల్ డిఫెన్స్ వెబ్ పోర్టల్ ప్రారంభం, అగ్నిమాపక- ఫస్ట్ ఎయిడ్ అవగాహన కార్యక్రమాలు ఆయన దూరదృష్టికి నిదర్శనం. 

ఈ పురస్కారం సివిల్ డిఫెన్స్ బృందం కృషికి దక్కిన గౌరవమని ఉదయనాథ్ అన్నారు. సమాజ సేవ, సిద్ధతను మరింత బలోపేతం చేయడమే తమ లక్ష్యంమని పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఉదయనాథ్, ఆయన నేతృత్వంలోని బృందాన్ని సౌత్ సెంట్రల్ రైల్వే సివిల్ డిఫెన్స్ ఆర్గనైజేషన్ అభినందించింది.