కాచిగూడ - కాకినాడ మధ్య ప్రత్యేక రైళ్లు

 కాచిగూడ - కాకినాడ మధ్య ప్రత్యేక రైళ్లు

దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. వేసవిలో ప్రయాణీకుల రద్దీని క్లియర్ చేయడానికి కాచిగూడ - కాకినాడ టౌన్ మధ్య ప్రత్యేక రైళ్లు నడపాలని నిర్ణయించింది. 

రైలు నెం- 07417 కాచిగూడలో మే 13న రాత్రి 8.45 గంటలకు బయలుదేరి మే 14 న ఉదయం 8.40 గంటలకు కాకినాడ టౌన్‌కి చేరుకుంటుంది.  రైలు నెం -07418  మే 14న కాకినాడ టౌన్‌లో రాత్రి 9.55 గంటలకు బయలుదేరి మే 15న ఉదయం 9.45 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది. 

ఈ రైళ్లు కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, రాయనపాడు, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, తణుకు, నిడదవోలు, రాజమండ్రి మరియు సామర్లకోట స్టేషన్లలో రెండు వైపులా ఆగుతాయి .రైళ్లలో ఏసీ II టైర్, ఏసీ III టైర్, స్లీపర్ III టైర్‌, సాధారణ  సెకండ్ క్లాస్ కోచ్ లు ఉంటాయి.