ఇవాళ్టి నుంచి 23 వరకు పలు రూట్లలో రైళ్లు రద్దు..

ఇవాళ్టి నుంచి 23 వరకు పలు రూట్లలో రైళ్లు రద్దు..

సికింద్రాబాద్, వెలుగు : మౌలిక సదుపాయాల ఏర్పాటుపై వివిధ రూట్లలోని ట్రాక్​లో జరుగుతున్న మెయింటెన్స్​ పనుల కారణంగా ఆ రూట్లలో నడుస్తున్న 24  రైళ్లను ఈనెల సోమవారం నుంచి 23 వ తేదీ వరకు రద్దుచేశామని దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. 

రద్దయిన రైళ్లలో  కాజీపేట–-డోర్నకల్–-కాజీపేట, విజయవాడ–డోర్నకల్–-విజయవాడ, విజయవాడ–-భద్రాచలం–-విజయవాడ, సికింద్రాబాద్–-వికారాబాద్​, వికారాబాద్–​-కాచిగూడ, సికింద్రాబాద్​– -వరంగల్, వరంగల్​– హైదరాబాద్, సిర్పూర్​టౌన్– ​-కరీంనగర్​– -సిర్పూర్​ టౌన్, కరీంనగర్​-– నిజామాబాద్-– కరీంనగర్, కాజీపేట– -సిర్పూర్​ టౌన్, భద్రాచలం–-బల్లార్షా, సిర్పూర్  టౌన్–భద్రాచలం, కాజీపేట– -బల్లార్షా-– కాజీపేట, కాచిగూడ–-నిజామాబాద్, నాందేడ్​– -నిజామాబాద్​– -నాందేడ్​ స్టేషన్ల మధ్య నడిచే రైళ్లు అందుబాటులో ఉండవు. ఈ మార్పును ప్రయాణికులు గమనించాలని అధికారులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

ALSO READ :ఎమ్మెల్యేల చేతుల్లోనే రూ.లక్ష బీసీ లోన్‍.. గృహలక్ష్మి స్కీం ఎంపిక చూసేది కూడా లీడర్లే