పూరీ రథయాత్రకు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు

పూరీ రథయాత్రకు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు

హైదరాబాద్‌ : పూరీ రథయాత్రకు వెళ్లే భక్తులకు శుభవార్త. పూరీ యాత్రీకుల కోసం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. జూన్‌ 18వ తేదీ నుంచి 22 మధ్య 6 ప్రత్యేక రైళ్లు నడపనున్నట్టు రైల్వేశాఖ ప్రకటించింది. ఈ రైళ్లు సికింద్రాబాద్‌, కాచిగూడ, నాందేడ్‌ నుంచి ప్రారంభమవుతాయని వెల్లడించింది. టికెట్‌ రిజర్వేషన్‌ సదుపాయం ఇప్పటికే ప్రారంభమైందని, ఏసీ, నాన్‌ ఏసీ సదుపాయం కల్పించినట్టు రైల్వేశాఖ అధికారులు వెల్లడించారు.