రైళ్లలో సేఫ్టీ ప్రికాషన్స్ మస్ట్: అరుణ్ కుమార్ జైన్

రైళ్లలో సేఫ్టీ ప్రికాషన్స్ మస్ట్:  అరుణ్ కుమార్ జైన్

సికింద్రాబాద్, వెలుగు: రైళ్ల నిర్వహణలో భద్రతా విధానాలను  తప్పనిసరిగా పాటించాలని సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ సూచించారు. రైళ్లలో భద్రత, లోడింగ్ పనితీరు, జోన్ వ్యాప్తంగా వివిధ అభివృద్ధి పనుల పురోగతిపై సోమవారం సికింద్రాబాద్ లోని రైల్ నిలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లోకో పైలట్లు, అసిస్టెంట్ లోకో పైలట్లు ఎప్పటికప్పుడు సిబ్బందికి కౌన్సిలింగ్ ఇవ్వాలన్నారు. రైళ్ల సగటు వేగాన్ని మెరుగుపరచడానికి ప్లానింగ్, దూర ప్రాంతాలకు వెళ్లే రైళ్ల వేగంపై ఆయన సమీక్షించారు. గూడ్స్ రైళ్ల వేగాన్ని మెరుగుపరచాలని ఆయన సూచించారు.