సంక్రాంతికి మరో 41 స్పెషల్ రైళ్లు

సంక్రాంతికి మరో 41 స్పెషల్ రైళ్లు

హైదరాబాద్​ సిటీ, వెలుగు: సంక్రాంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాల మధ్య పెరుగుతున్న ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక రైళ్లు నడుపుతున్నామని దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. ఇప్పటికే కొన్ని రైళ్లను ప్రకటించగా తాజాగా మరో 41 స్పెషల్​ రైళ్లను నడపనున్నట్టు అధికారులు పేర్కొన్నారు. జనవరి 8 నుంచి 20 వరకు ఈ ప్రత్యేక రైళ్లను నడపనున్నట్టు చెప్పారు. 

ఆయా ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్ధం ఈ నెల 14వతేదీ  నుంచే రిజర్వేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని వెల్లడించారు. ఆదివారం ఉదయం 8గంటల నుంచి రిజర్వేషన్లు అందుబాటులో ఉంటాయని తెలిపారు.