సికింద్రాబాద్ నుంచి తిరుపతి, భువనేశ్వర్ కు స్పెషల్ రైళ్లు.. టైమింగ్స్ ఇలా..

సికింద్రాబాద్ నుంచి తిరుపతి, భువనేశ్వర్ కు స్పెషల్ రైళ్లు.. టైమింగ్స్ ఇలా..

రైల్వే స్టేషన్లో అదనపు రద్దీని తగ్గించేందుకు దక్షిణ మధ్య రైల్వే వివిధ ప్రాంతాల మధ్య స్పెషల్​ ట్రైన్స్​ నడుపుతోంది.  సికింద్రాబాద్​ నుంచి తిరుపతి, భువనేశ్వర్​లకు కూడా రెండు రోజులపాటు రైళ్లను నడపనుంది.  ట్రైన్ నంబర్ 07489 (సికింద్రాబాద్ –- తిరుపతి) సికింద్రాబాద్‌లో ఆగస్టు 11 రాత్రి 10.05 నిమిషాలకు బయలుదేరి ఆగస్టు 12న ఉదయం 9.30 కు తిరుపతికి చేరుకుంటుంది. రైలు నెం -07490 (తిరుపతి – సికింద్రాబాద్) తిరుపతిలో అదే రోజు సాయంత్రం 4.35 కు బయలుదేరి ఆగస్టు 13న తెల్లవారుజామున 4.50 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది. 

ఈ ప్రత్యేక రైలు కాచిగూడ, ఉమ్దానగర్, షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, వనపర్తి రోడ్, గద్వాల్, రాయచూర్, మంత్రాలయం రోడ్, ఆదోని, గుంతకల్, గూటి, తాడిపత్రి, యర్రగుంట్ల, కడప, రాజంపేట, రేణిగుంట స్టేషన్లలో ఆగుతుంది. 

ట్రైన్​నంబర్- 07058 (సికింద్రాబాద్ – - భువనేశ్వర్) సికింద్రాబాద్ నుండి మధ్యాహ్నం 3.25 కు బయలుదేరి ఆగస్టు 12న ఉదయం 10.30 గంటలకు భువనేశ్వర్ చేరుకుంటుంది. రైలు నెం- 07059 (భువనేశ్వర్- – సికింద్రాబాద్) భువనేశ్వర్ నుండి మధ్యాహ్నం 3.05 గంటలకు బయలుదేరి ఆగస్టు 13న ఉదయం 3.05 గంటలకు చేరుకుంటుంది. 

ఈ రైలు నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, గుంటూరు జంక్షన్, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం రోడ్, పలాస, ఇచ్ఛాపురం, బెర్హంపూర్, బలుగాన్, ఖుర్దా రోడ్ స్టేషన్లలో ఆగుతుంది.