Vastu Tips: దక్షిణం నైరుతి దిక్కులో ప్రధాన ద్వారం ఉండొచ్చా.. ఉంటే ఇబ్బందులు వస్తాయా..?

Vastu Tips: దక్షిణం నైరుతి దిక్కులో ప్రధాన ద్వారం ఉండొచ్చా.. ఉంటే ఇబ్బందులు వస్తాయా..?

ప్రతి ఒక్కరు కొద్దిపాటి స్థలంలోనైనా కొత్త ఇల్లు కట్టుకోవాలనుకుంటాం.  ఒక్కోసారి దక్షిణం దిక్కులో ముఖద్వారం పెట్టుకోవలసి వస్తుంది. ప్రధాన ద్వారం నైరుతిలో ఉంటే ఏమైనా ఇబ్బందులు ఉంటాయా.. అలాగే   ఉత్తరం వైపు రోడ్డు ఉన్న స్థలంలో ఇల్లు కట్టుకుంటే.. బెడ్​ రూం.. కిచెన్​ ఎటువైపు ఉండాలి.. మొదలగు విషయాలపై వాస్తు కన్సల్టెంట్  కాశీనాథుని శ్రీనివాస్ అందిస్తున్న సలహాలను ఒకసారి పరిశీలిద్దాం. . . 

ప్రశ్న: దక్షిణ ముఖద్వారంతో ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాం. ప్రధాన ద్వారం దక్షిణ నైరుతి, దక్షిణ ఆగ్నేయంలలో ఏ దిక్కు కట్టుకోవాలి?

జవాబు: దక్షిణ నైరుతిలో ప్రధాన ద్వారం పెట్టుకోకూడదు. దక్షిణ ఆగ్నేయం లేదా దక్షిణ సెంటర్లో ప్రధాన ద్వారం పెట్టుకోవచ్చు.

ప్రశ్న: ఉత్తరం వైపు రోడ్ ఉన్న స్థలంలో, తూర్పు వైపు ప్రధాన ద్వారం ఉండేలా ఇల్లు కట్టుకోవచ్చా? బెడ్రూమ్, కిచెన్ ఎటువైపు ఉంటే బాగుంటుంది?

జవాబు:  తూర్పు వైపు ప్రధాన ద్వారం ఉండేలా ఇల్లు కట్టుకోవచ్చు. ఉత్తరం వైపు అయినా మెయిన్ డోర్ పెట్టుకోవచ్చు. ఈ ఇంటిలో మాస్టర్ బెడ్రూమ్ నైరుతి (పడమర నైరుతి లేదా దక్షిణ నైరుతి)లో, కిచెన్ ఆగ్నేయంలో ఉండాలి