ట్రయల్​ రన్​లో సక్సెస్​ .. 11న ప్రారంభించనున్న మోడీ

ట్రయల్​ రన్​లో సక్సెస్​ .. 11న ప్రారంభించనున్న మోడీ

చెన్నై: దక్షిణ భారతదేశంలో మొదటి హైస్పీడ్​ రైలుకు సోమవారం ట్రయల్​ రన్​ మొదలైంది. చెన్నై–మైసూరు మధ్య వందే భారత్​ఎక్స్​ప్రెస్ పరుగులు తీసింది. ఈ రైలును నవంబర్ 11న ప్రధాని నరేంద్ర మోడీ జెండా ఊపి ప్రారంభిస్తారు. దక్షిణ భారతంలో మొట్టమొదటి, దేశంలో ఐదో హైస్పీడ్​ రైలుగా దీనికి గుర్తింపు దక్కనుంది. వందే భారత్ ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రెస్​లలో తొలి రైలు 2019 ఫిబ్రవరి 15న ఢిల్లీ కాన్పూర్  అలహాబాద్ వారణాసి మార్గంలో ప్రారంభమైంది. ‘మేక్ ఇన్ ఇండియా' ప్రచారాన్ని బలోపేతం చేయడంలో భాగంగా ఈ వందే భారత్ ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రెస్​ను తీసుకొచ్చారు. అయితే,  2021 ఆగస్టు 15న ఎర్రకోట నుంచి జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో దేశం నలుమూలలనూ కలిపేందుకు 75 వారాలలో 75 వందే భారత్​ రైళ్లను తీసుకొస్తామని ప్రధాని మోడీ ప్రకటించారు.