
ప్రతి ఒక్కరు సొంతిల్లు కట్టుకోవాలనో... కట్టిన ఇంటిని కొనాలనో.. లేదా ఆర్థిక స్థోమతను బట్టి అపార్ట్ మెంట్కొనడమో చేస్తుంటారు. ఏది కొన్నా... కట్టుకున్నా వాస్తు సిద్దాంతిని అవలంభించాలి. లేకపోతే అనేక ఇబ్బందులు వస్తాయని వాస్తు నిపుణలు చెబుతున్నారు. దక్షిణం వైపు బాల్కనీ ఉంటే గ్రిల్స్ తో క్లోజ్ చేస్తే నష్టాలు కలుగుతాయా.. అలాగే 50 అడుగుల స్థలంలో ఇంటి నిర్మాణంలో మెయన్ డోర్.. బెడ్ రూమ్స్ ఏ దిక్కులో ఉండాలి.. వాస్తు కన్సల్టెంట్ కాశీనాథుని శ్రీనివాస్ సూచిస్తున్న సలహాలేమిటో తెలుసుకుందాం. . . !
ప్రశ్న: దక్షిణ బాల్కనీని గ్రిల్స్ వేసి మూసివేయాలి అనుకుంటున్నాం. ఇలా చేయడం కరెక్టేనా? లేక అలాగే వదిలేయాలా?
జవాబు: ఈమధ్య బాల్కనీలను కొంతమంది ఒకవైపు మూసేస్తున్నారు. వీలునుబట్టి ఇలా చేసినా తప్పులేదు. దక్షిణంవైపు అవసరం లేదనుకుంటే గ్రిల్స్ వేసి మూసివేసినా పర్వాలేదు. అయితే, మీ బాల్కనీ నుంచి గాలి, వెలుతురు సరిగ్గా వచ్చేలా చూసుకోవాలి.
ప్రశ్న: నాలుగు దిక్కుల్లో యాభై చదరపు అడుగుల స్థలం ఉంది. స్థలానికి పడమర దిక్కు మెయిన్ రోడ్డు, ఉత్తరం దిక్కు చిన్న రోడ్డు ఉంది. ఈ స్థలానికి ఇంటి నిర్మాణం ఎలా ఉండాలి? మెయిన్ డోర్, బెడ్రూమ్స్ ఎటువైపు ఉంటే మంచిది?
జవాబు: పడమర, ఉత్తర దిక్కుల్లో రోడ్స్ ఉన్న ఇంటికి పడమర వాయువ్యంలో మెయిన్ డోర్ ఏర్పాటు చేసుకోవాలి. లేదా ఉత్తరం వైపు రోడ్ ఉన్నప్పుడు ఉత్తర దిక్కు మెయిన్ డోర్ కూడా పెట్టుకోవచ్చు. బెడ్రూమ్ డోర్ ఉత్తర ఈశాన్యంలో ఉండాలి.