'ఎవరే అతగాడు' సినిమాలో రేఖ పాత్రతో 2003లో తెలుగు తెరకు పరిచయమైన అమ్మడు ప్రియమణి. తన నట, అభినయంతో దక్షిణాది ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. తెలుగు, తమిళ, కన్నడ, మళయాలం సినిమాల్లో నటించిన ఈ అమ్మడు పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేస్తోంది. వచ్చిన ప్రతి ఆఫర్ ను సద్వినియోగం చేసుకుంటూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకుంది.
సినిమా రెమ్యూనరేషన్ గురించి కీలక వ్యాఖ్యలు చేసింది ప్రియమణి. తానెప్పుడూ పారితోషికానికి ప్రాధాన్యం ఇవ్వలేదని చెప్పుకొచ్చింది. తనతో పాటు నటించిన వారి కన్నా తక్కువ మ్యూనరేషన్ తీసుకున్నట్టు తెలిపింది. పారితోషికం అనేది పాత్ర నిడివి, నా నటన ఆధారంగా దాన్ని అందిస్తారన్న అవగాహన ఉందని చెప్పిందీ భామ. తాను అర్హురాలీని అని భావిస్తే డిమాండ్ చేస్తానంటోంది. అనవసరంగా రెమ్యూనరేషన్ పెంచాలని కోరనని చెబుతోందీ అమ్మడు.
సౌత్ లో ఉదయం 8 గంటలకు షూటింగ్ ప్రారంభిస్తామని షెడ్యూల్ ఇస్తే కచ్చితంగా ఆ సమయానికి వచ్చేస్తామని ప్రియమణి చెప్పింది. కానీ నార్త్ లో ఆ సమయానికి నటీనటులు ఇంటినుంచి బయల్దేరుతారని తెలిపింది. ఇటీవల సినీ ఇండస్ట్రీలో 8 గంటల పని డిమాండ్ నేపథ్యంలో ప్రియమణి వ్యాఖ్యాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ప్రస్తుతం వరుస బిజీగా ఉందీ అమ్మడు. ఇటీవలే 'ఆఫీసర్ ఆఫ్ డ్యూటీ', 'ది గుడ్ వైఫ్'లతో ప్రేక్షకుల ను పలకరించారు. కోలీవుడ్ అగ్ర కథా నాయకుడు విజయ్ ప్రధాన పాత్రలో రానున్న 'జన నాయ గన్'లో నటిస్తోంది.
