లేఅవుట్​​లలో సబ్​స్టేషన్ల కోసం స్థలం

లేఅవుట్​​లలో సబ్​స్టేషన్ల కోసం స్థలం
  •     సర్క్యూలర్ జారీ చేసిన సదరన్​ డిస్కం

హైదరాబాద్, వెలుగు: పట్టణ ప్రాంతాల్లో స్థలాల కొరతతో సబ్​ స్టేషన్​లను అందుబాటులోకి తెచ్చేందుకు సదరన్​ డిస్కం కొత్త  సర్క్యూలర్​  జారీ చేసింది. సబ్​స్టేషన్​ల ఏర్పాటుకు పట్టణాల్లో కొత్తగా నిర్మించే మల్టీ స్టోర్డ్ బిల్డింగులు, లేఅవుట్​లలో స్థలం కేటాయించాలని స్పష్టం చేసింది. స్థలాల కొరతతో ఈ నిర్ణయం తీసుకున్నమంది. ఈ సర్క్యూలర్ ప్రకారం..500 ఇండ్లతో మల్టీ స్టోర్డ్​ బిల్డింగ్స్ ​నిర్మించే సంస్థలు..2500 కిలోవాట్​లకు పైగా  లోడ్​ ఉండే విద్యుత్​ సరఫరా చేసేందుకు 800 చదరపు గజాల స్థలాన్ని కేటాయించాలి. అదే విధంగా..35 ఎకరాల్లో ఏర్పాటు చేసే  ఓపెన్​ ప్లాట్​ లేఅవుట్​లు,  అంతే విస్తీర్ణంలో నిర్మించే గేటెడ్​కమ్యూటీ విల్లాలకు కరెంటు సరఫరా కోసం 1500 చదరపు గజాల స్థలాన్ని కేటాయించాలి. లీగల్​ కేటాయింపులు చేసి స్థలాన్ని డిస్కంకు హ్యాండోవర్​ చేస్తే ఆ స్థలంలో 13కేవీ 11కేవీ సబ్​ స్టేషన్​లను నిర్మిస్తారు.