ఈ సారి నైరుతి రుతుపవనాలు ఆలస్యం

ఈ సారి నైరుతి రుతుపవనాలు ఆలస్యం

ఢిల్లీ : నైరుతి రుతుపవనాలు జూన్‌ 6న కేరళలోకి ప్రవేశించనున్నాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) బుధవారం తెలిపింది. సాధారణంగా మన దేశంలో ప్రతి సంవత్సరం జూన్‌ 1న నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయి. జులై రెండో వారానికి దేశమంతా వ్యాపిస్తాయి. అయితే ఈ సారి ఐదు రోజులు ఆలస్యం కానున్నట్లు తెలిపింది భారత వాతావరణశాఖ(ఐఎండీ).

నికోబార్ దీవుల్లో ప్ర‌స్తుతం నైరుతీ రుతుప‌వ‌నాల‌కు సంబంధించి అనుకూల వాతావ‌ర‌ణం ఉన్న‌ట్లు ఐఎండీ చెప్పింది. ఈసారి వ‌ర్ష‌పాతం సాధార‌ణంగానే ఉంటుంద‌ని ఐఎండీ అంచ‌నా వేస్తోంది. 2015లో ఒక‌సారి మాత్ర‌మే త‌మ అంచ‌నా త‌ప్పింద‌ని తెలిపిన ఐఎండీ.. మొత్తం ఆరు ప‌రిమితుల‌ను ఆధారం చేసుకుని వాతావ‌ర‌ణాన్ని అంచ‌నా వేస్తామ‌ని చెప్పింది.