సోయం కామెంట్లు రెచ్చగొట్టేలా ఉన్నయ్

సోయం కామెంట్లు రెచ్చగొట్టేలా ఉన్నయ్

హైదరాబాద్, వెలుగు: లంబాడీలను ఎస్టీజాబితా నుంచి తొలగించాలని బీజేపీ ఎంపీ సోయం బాపురావు చేసిన కామెంట్లపై కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ స్పందించారు. సోయంబాపురావు మాటలు విద్వేషాన్ని రెచ్చగొట్టేలాఉన్నాయని..ఆయన చట్టాల గురించి తెలుసుకుని మాట్లాడాలని బలరాం నాయక్ అన్నారు. ఎస్టీ జాబితా నుంచి లంబాడీల తొలగింపు సాధ్యం కాదని తెలిపారు. బుధవారం గాంధీభవన్​లో బలరాం నాయక్  మీడియాతో మాట్లాడారు. లంబాడీ లను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలంటే 21 రాష్ట్రాల నుంచి ప్రపోజల్స్​ రావాలని, అసెంబ్లీ తీర్మానాలు చేయాల్సి ఉంటుందని వివరించారు.