మహబూబాబాద్, వెలుగు: గంజాయి అరికట్టడానికి ప్రజలు సహకరించాలని మహబూబాబాద్ ఎస్పీ శబరీష్ కోరారు. గురువారం బయ్యారంమండలం కొత్తపేట గ్రామంలో 24 సీసీ కెమెరాలను ప్రారంభించారు. గంజాయి వినియోగదారులు, సరఫరా చేసే వ్యక్తుల గురించి సమాచారం అందించిన వారికి రూ.5,000 వరకు బహుమతి ఇందిస్తామని తెలిపారు.
సమాచారం ఇచ్చే వ్యక్తి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచుతామని, గంజాయిపై సమాచారాన్ని 8712656999 కు అందించాలని కోరారు. గ్రామంలో 24 సీసీ కెమెరాల ఏర్పాటు ఎంతో అభినందనీయమని, సర్పంచ్ ప్రవీణ్ ను అభినందించారు. కార్యక్రమంలో బయ్యారం సీఐ రవీందర్, ఎస్సై తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
