మెదక్ జిల్లాలో ప్రత్యేక లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలి : ఎస్పీ డీవీ శ్రీనివాస రావు

మెదక్ జిల్లాలో ప్రత్యేక లోక్ అదాలత్ను సద్వినియోగం  చేసుకోవాలి : ఎస్పీ డీవీ శ్రీనివాస రావు

మెదక్​ టౌన్, వెలుగు: జిల్లా వ్యాప్తంగా ఈనెల 15న నిర్వహించే ప్రత్యేక లోక్​ అదాలత్​ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ డీవీ శ్రీనివాస్​ రావు సూచించారు. మంగళవారం తన ఆఫీసులో మీడియాతో మాట్లాడుతూ.. ప్రత్యేక లోక్ అదాలత్​లో క్రిమినల్, సివిల్, ఆస్తి విభజన, వైవాహిక, కుటుంబ,  డ్రంకన్​డ్రైవ్, చెక్ బౌన్స్, బ్యాంకు రికవరీ, విద్యుత్ చౌర్యం కేసులు పరిష్కరించుకోవచ్చన్నారు. 

న్యాయశాఖ అందిస్తున్న ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. జిల్లా పోలీసు అధికారులు, స్టేషన్ హౌస్ ఆఫీసర్లు, కోర్టు విధులు నిర్వర్తించే కానిస్టేబుళ్లు, సిబ్బంది రాజీ పడదగిన కేసులను గుర్తించి కక్షిదారులకు కౌన్సెలింగ్​ఇవ్వాలన్నారు.