
నిర్మల్, వెలుగు: పోలీస్ స్టేషన్లకు వచ్చే పిటిషన్ల ఆధారంగా ఇన్ఫర్మేషన్ సిస్టం డెవలప్ చేసుకోవాలని, ‘నిర్మల్ పోలీస్ మీ పోలీస్’ నినాదంతో విధులు నిర్వహించాలని ఎస్పీ జానకి షర్మిల సూచించారు. శనివారం నిర్మల్జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల అధికారులు, సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. క్రమశిక్షణతో సమయపాలన పాటిస్తూ నిజాయితీగా పని చేసే వారికి పోలీస్ శాఖలో ప్రత్యేక గుర్తింపు ఉంటుందని తెలిపారు. బ్లూ కోల్ట్స్, పెట్రో కార్ డ్యూటీలు పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. ఏఎస్పీలు అవినాశ్ కుమార్, రాజేశ్ మీనా, ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు పాల్గొన్నారు.
70 మంది మైనర్లపై డ్రైవింగ్ కేసులు
రోడ్డు ప్రమాదాల నియంత్రణలో భాగంగా శని వారం జిల్లా వ్యాప్తంగా మైనర్ డ్రైవిం గ్ పై స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. ఈ సందర్భంగా డ్రైవింగ్చేస్తున్న 70 మంది మైనర్లను పట్టుకొని, కేసులు నమోదు చేశారు. వారికి, వారి తల్లిదండ్రులకు ఏఎస్పీలు అవినాశ్ కుమార్, రాజేశ్ మీనా కౌన్సెలింగ్ చేశారు. ఇకనుంచి మైనర్లకు వాహనాలు ఇస్తే వాటి యజమానులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.