పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించాలి : ఎస్పీ పరితోశ్ పంకజ్

పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించాలి : ఎస్పీ పరితోశ్ పంకజ్
  •     ఎస్పీ పరితోశ్​ పంకజ్

సంగారెడ్డి టౌన్ , వెలుగు: పెండింగ్​ కేసులను త్వరగా పరిష్కరించాలని ఎస్పీ పరితోశ్​పంకజ్​ సూచించారు. గురువారం సంగారెడ్డి లోని జిల్లా పోలీస్ ఆఫీసులో నెలవారీ నేర సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ.. కేసు నమోదు నుంచి చార్జిషీట్‌ వరకు ప్రతి విషయాన్నీ కూలంకుశంగా పరిశోధించాలన్నారు. 

పోక్సో, గ్రేవ్‌ కేసుల్లో త్వరగా దర్యాప్తు పూర్తి చేసి చార్జిషీట్‌ దాఖలు చేయాలన్నారు. కమ్యూనిటీ పోలీసింగ్‌ ద్వారా గ్రామాల్లో సీసీ టీవీల ప్రాధాన్యంపై అవగాహన కల్పించాలన్నారు. మహిళల భద్రతకు మరింత భరోసా కల్పిస్తూ వారి రక్షణే ధ్యేయంగా సత్వర సేవలందించాలన్నారు. సైబర్‌క్రైం, డయల్‌ 100 వాటి వినియోగంపై విద్యార్థులు, ప్రజల కు అవగాహన కల్పించాలని సూచించారు. 

సమీక్షలో అడిషనల్​ఎస్పీ రఘునందన్ రావు, డిఎస్పీలు సత్తయ్య గౌడ్, ప్రభాకర్, వెంకట్ రెడ్డి, సైదా నాయక్, సురేందర్ రెడ్డి, నరేందర్, సీఐ రమేశ్, కిరణ్ కుమార్, నాగేశ్వరరావు, నాగరాజు, ప్రవీణ్ రెడ్డి, నాగేశ్వరరావు పాల్గొన్నారు.