సమస్యాత్మక ప్రాంతాలపై దృష్టి పెట్టాలి : ఎస్పీ రాజేశ్ చంద్ర

సమస్యాత్మక  ప్రాంతాలపై దృష్టి పెట్టాలి : ఎస్పీ రాజేశ్ చంద్ర
  •     ఎస్పీ రాజేశ్​ చంద్ర  

కామారెడ్డి , వెలుగు : స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా సమస్యాత్మక ఏరియాలపై దృష్టి సారించాలని ఎస్పీ రాజేశ్​ చంద్ర  పోలీసు అధికారులకు సూచించారు.  శుక్రవారం జిల్లా పోలీసు ఆఫీస్​లో  నెలవారీ రివ్యూ మీటింగ్ జరిగింది.  పెండింగ్ కేసులు, వివిధ అంశాలపై స్టేషన్ల వారీగా ఎస్పీ రివ్యూ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు పారదర్శకంగా జరిగే చూడాలన్నారు. ప్రతి పోలీసు అధికారి గ్రామాల పరిస్థితులను ముందుగానే అంచనా వేసి , సమస్యాత్మాక ప్రాంతాలపై ఫోకస్  పెట్టాలన్నారు.  సోషల్​ మీడియాపై దృష్టి పెట్టాలని,  చెడు ప్రవర్తన కలిగినవారిని బైండోవర్ చేయాలన్నారు.  

దీర్ఘకాలికంగా పెండింగ్​లో ఉన్న కేసులను క్లియర్​ చేయటానికి స్పెషల్ యాక్షన్​ ప్లాన్​ తయారు చేయాలన్నారు. ప్రతి కేసులో నాణ్యమైన ఎంక్వైరీ ఉండాలన్నారు. ప్రతి రోజు పోలీసు అధికారులు గ్రామాలను సందర్శిస్తూ  రోడ్డు భద్రత,  సైబర్​ క్రైమ్​లపై అవగాహన కల్పించాలన్నారు. రౌడీ షీటర్స్​, అనుమానిత వ్యక్తులపై నిఘా ఉంచాలన్నారు.  వెహికల్స్​ను రాష్​గా నడిపేవారిపై కేసులు నమోదు చేయాలన్నారు.  

పార్ది గ్యాంగులను పట్టుకోవటంతో కీలకపాత్ర పోషిస్తున్న కామారెడ్డి జిల్లా పోలీసులను డీజీపీ అభినందించారని ఎస్పీ తెలిపారు.  అడిషనల్ ఎస్పీ నరసింహారెడ్డి, ఏఎస్సీ చైతన్యారెడ్డి,  డీఎస్పీలు శ్రీనివాస్​రావు,  విఠల్​రెడ్డి,  సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.