కామారెడ్డిటౌన్, వెలుగు : అత్యవసర పరిస్థితుల్లో వచ్చే డయల్ 100 కాల్స్ కు వెంటనే స్పందించాలని, ఫిర్యాదుల విషయంలో నిర్లక్ష్యం చేయవద్దని ఎస్పీ రాజేశ్చంద్ర పోలీస్ సిబ్బందికి సూచించారు. మంగళవారం దేవునిపల్లి పోలీస్ స్టేషన్ను ఎస్పీ తనిఖీ చేశారు. స్టేషన్ పరిసరాలు, రిసెప్షన్ సెంటర్, రికార్డులను పరిశీలించి మాట్లాడారు.
ప్రజల అవసరాలకు అనుగుణంగా సిబ్బంది పని చేయాలన్నారు. పెండింగ్ కేసులు పరిష్కరించాలని, సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ముమ్మరం చేయాలన్నారు. నేర ప్రవర్తన కలిగిన వ్యక్తులపై నిరంతరం నిఘా పెట్టాలన్నారు. ఎస్పీ వెంట ఏఎస్పీ చైతన్యారెడ్డి, రూరల్ సీఐ రామన్, ఎస్సై రంజిత్ ఉన్నారు.
143 సెల్ఫోన్లు రికవరీ..
కామారెడ్డి జిల్లాలో రూ.23 లక్షల విలువైన 143 సెల్ఫోన్లను రికవరీ చేసినట్లు ఎస్పీ రాజేశ్చంద్ర తెలిపారు. సీఈఐఆర్ సిస్టమ్ ద్వారా ఫోన్లను రికవరీ చేశామన్నారు. సెల్ఫోన్ పోయినా, చోరీకి గురైనా వెంటనే పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయాలన్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు రూ. 2 కోట్ల 75 లక్షల విలువైన 1,722 సెల్ఫోన్లను రికవరీ చేసినట్లు తెలిపారు. ఆర్ఎస్సై బాల్రాజు,
సిబ్బంది ఉన్నారు.
