ప్రజలకు చేరువయ్యేలా పోలీసు సేవలు ఉండాలి : ఎస్పీ రాజేశ్​చంద్ర

ప్రజలకు చేరువయ్యేలా పోలీసు సేవలు ఉండాలి : ఎస్పీ రాజేశ్​చంద్ర
  • ఎస్పీ రాజేశ్​చంద్ర 

పిట్లం, వెలుగు : పోలీసుల సేవలు ప్రజలకు మరింత చేరువయ్యేలా విధులు నిర్వహించాలని ఎస్పీ రాజేశ్​ చంద్ర అన్నారు. మంగళవారం పెద్దకొడప్​గల్​ పోలీస్టేషన్​ను ఎస్పీ తనిఖీ చేశారు. రిసెప్షనిస్టు, స్టేషన్​ రైటర్​, టెక్​టీమ్​, మెన్​రెస్ట్​రూం, లాకప్​రూం స్టేషన్​ పరిసరాలు పరిశీలించి మాట్లాడారు. బాధితులను న్యాయం జరిగేలా కేసులు దర్యాప్తు చేయాలన్నారు.  డయల్​ 100  కు వెంటనే స్పందించాలన్నారు. నేరాల అదుపునకు ఎక్కువ మొత్తంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. విస్తృతంగా డంక్ అండ్​ ​డ్రైవ్ చేపట్టి ప్రమాదాలు నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. ఆన్​లైన్​ మోసాలు, మూఢ నమ్మకాలపై ప్రజల్లో అవగాహన పెంచాలన్నారు.  ఎస్పీ వెంట బాన్సువాడ డీఎస్పీ విఠల్​రెడ్డి, బిచ్కుంద సీఐ  నరేశ్, ఎస్సై మోహన్​రెడ్డి ఉన్నారు. 

పరీక్ష కేంద్రాన్ని పరిశీలించిన ఎస్పీ 

ఎల్లారెడ్డి, వెలుగు : ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతున్న ఎల్లారెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఎస్పీ సందర్శించి భద్రతా ఏర్పాట్లు, బందోబస్తును సమీక్షించారు.