
కామారెడ్డి టౌన్, తాడ్వాయి, వెలుగు : వర్షాలు కురుస్తున్న దృష్ట్యా ప్రజలు అలర్ట్గా ఉండాలని ఎస్పీ రాజేశ్చంద్ర జిల్లా ప్రజలకు సూచించారు. బుధవారం తాడ్వాయి మండలం భీమేశ్వరం ఆలయం వద్ద వాగును ఎస్పీ పరిశీలించారు. రైతులు వాగులు దాటేటప్పుడు అప్రమత్తంగా ఉండాలన్నారు. పిల్లలు, వృద్ధులు, మహిళలు వరద నీటి ప్రవాహం ఉన్న ఏరియాలకు వెళ్లవద్దన్నారు. సదాశివనగర్ సీఐ సంతోష్‌కుమార్, ఎస్సై మురళీ ఉన్నారు.
కామారెడ్డిలో వాగును పరిశీలించిన ఏఎస్పీ..
కామారెడ్డి హౌజింగ్ బోర్డు కాలనీ పక్కన ఉన్న వాగును బుధవారం ఏఎస్పీ చైతన్యారెడ్డి పరిశీలించారు. నిరుడు కురిసిన భారీ వర్షాలకు వాగు పొంగి ఇండ్లలోకి నీరు చేరింది. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నందున ముందు
జాగ్రత్తగా ఏఎస్పీ వాగును పరిశీలించారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలను అధికారులకు సూచించారు. రూరల్ సీఐ రామన్ ఉన్నారు.