భద్రత కోసమే మై ఆటో ఈజ్ సేఫ్ : ఎస్పీ రూపేశ్

భద్రత కోసమే మై ఆటో ఈజ్ సేఫ్ : ఎస్పీ రూపేశ్

సంగారెడ్డి టౌన్, వెలుగు : ప్రజల సురక్షిత ప్రయాణం కోసం 'మై ఆటో ఇజ్ సేఫ్' అనే కార్యక్రమం తీసుకొస్తున్నట్లు ఎస్పీ రూపేశ్ తెలిపారు. సోమవారం సంగారెడ్డిలోని కొత్త బస్టాండ్ వద్ద ఆటో స్టిక్కరింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. సంగారెడ్డి, పటాన్​చెరు, నారాయణఖేడ్, జహీరాబాద్ సబ్ డివిజన్​లో గల ఆటోలకు ప్రయాణికులకు కనిపించే విధంగా స్టిక్కరింగ్ చేస్తున్నామన్నారు. ప్రయాణం చేసే ముందు ఆటోకు గల మై ఆటో ఇజ్ సేఫ్ అనే  స్టిక్కరింగ్ ఉందా లేదా అని గమనించి ఆటో ఎక్కాలన్నారు. 

ఆటో డ్రైవర్ అసభ్యంగా మాట్లాడినా, దురుసుగా ప్రవర్తించినా వెంటనే డ్రైవర్ సీటు వెనకాల గల క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఆటోడ్రైవర్ కు సంబంధించిన పూర్తి వివరాలను స్క్రీన్ షాట్ తీసి డిస్​ ప్లే పైన కంప్లైంట్ షీటీం , ఎమర్జెన్సీ, ఆప్షన్స్ కనిపిస్తాయని వాటిని ఎంచుకొని సబ్మిట్ చేస్తే జిల్లా పోలీస్ ఆఫీసుకు చేరుతుందన్నారు . కంట్రోల్ రూమ్ లో సిబ్బంది కంప్లైంట్ ను రిసీవ్ చేసుకొని వెంటనే సంబంధిత ఆటో వివరాలను లోకల్ పీఎస్​కు తెలియజేసి సమస్య పరిష్కరిస్తారన్నారు.  కార్యక్రమంలో అడిషనల్​ఎస్పీ సంజీవరావు, డీఎస్పీలు సత్తయ్య గౌడ్,  రవీంద్ర రెడ్డి, సీఐ సుమన్, శ్రావణ్, భాస్కర్ ఉన్నారు.