ప్రజా సమస్యల పరిష్కారం కోసం గ్రీవెన్స్‌ డే : ఎస్పీ శరత్ చంద్ర పవార్

ప్రజా సమస్యల పరిష్కారం కోసం గ్రీవెన్స్‌ డే :  ఎస్పీ శరత్ చంద్ర పవార్
  •     ఎస్పీ శరత్ చంద్ర పవార్ 

నల్గొండ, వెలుగు: ప్రతి సోమవారం నిర్వహించే పోలీస్ గ్రీవెన్స్ డే కార్యక్రమాన్ని పోలీస్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ ప్రోగ్రాంకు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ హాజరై  ప్రజల నుంచి వచ్చిన 42 వివిధ ఫిర్యాదులను స్వీకరించి సంబంధిత అధికారులకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.  భూ వివాదాలు, కుటుంబ కలహాలు, మోసాలు, సైబర్ నేరాలు, ఇతర సమస్యలపై ప్రజలు తమ అర్జీలను సమర్పించారు. 

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించడమే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమన్నారు.  ప్రతి అర్జీపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు.  ప్రజలు పోలీస్ గ్రీవెన్స్ డేను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. గ్రీవెన్స్ డేకు హాజరుకాలేని వారు తమ సమస్యలను సంబంధిత పోలీస్ స్టేషన్‌లో లేదా ఆన్‌లైన్ ద్వారా తెలియజేయవచ్చని ఎస్పీ సూచించారు.