భారీ వర్షాలతో నష్టం లేకుండా చూడాలి : ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్

భారీ వర్షాలతో నష్టం లేకుండా చూడాలి : ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్

మహబూబాబాద్, వెలుగు: భారీ వర్షాల కారణంగా ఆస్తి, ప్రాణనష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని మహబూబాబాద్​ ఎస్పీ సుధీర్ రామ్​నాథ్ కేకన్​సూచించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆదివారం జిల్లాలోని మరిపెడ పీఎస్​ పరిధిలోని ఎడ్జెర్ల చెరువు, పురుషోత్తమాయగూడెం బ్రిడ్జిని పరిశీలించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ వాతావరణ శాఖ సూచనల మేరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో వాగులు ఉప్పొంగి రహదారులపై ప్రవహించే ప్రదేశంలో, నీటి ప్రమాదాలు జరిగే చోట ముందస్తు హెచ్చరికలు చేపడుతున్నట్లు తెలిపారు. చేపల వేటకు వెళ్లవద్దని, యువకులు ప్రమాదకర నీటి ప్రవాహాలు ఉన్న చోట సెల్ఫీలు తీసుకోవద్దన్నారు. 

చెరువులు, కుంటలు తెగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆయా శాఖల అధికారులతో సమన్వయంతో వ్యవహరించాలని సూచించారు. పోలీస్ పెట్రోలింగ్ ను మరింత విస్తృతం చేయాలన్నారు. వరద పరిస్థితుల్లో ఈ తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల ద్వారా అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. అత్యవసర సమయంలో 100 కాల్ చేయాలన్నారు. కార్యక్రమంలో మరిపెడ సీఐ రాజ్ కుమార్, ఎస్సై సంతోష్, పోలీస్​ సిబ్బంది ఉన్నారు.